Site icon TeluguMirchi.com

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఉదయభాను

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను ప్రముఖ నటి , యాంకర్ ఉదయ భాను స్వీకరించారు.

జూబ్లీహిల్స్ పార్క్ లో మూడు మొక్కలు నాటారు. మొక్కలు పెంచడం మనందరి కర్తవ్యం అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నెలరోజుపాటు భోజనం లేకుండా, వారం పాటు నీళ్లు లేకుండా ఉండగలం కానీ, ఒక్క నిమిషం పాటు ఆక్సిజన్ లేకుండా ఉండలేమని, పచ్చని చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ లభిస్తుందని అందుకే మొక్కలు పెంచాలని ఉదయభాను తెలిపింది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే మనందరం చూస్తూనే ఉన్నామని అన్నారు.

Exit mobile version