
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా పేజీ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ చరణ్ కు సంబందించిన విషయాలతో పాటు సామాజిక అంశాలను తెలియజేసే ఈమె..ఈ ఏడాది తన పెళ్లి రోజు గురించి చెప్పుకొని బాధ పడింది.
జూన్ 14 చరణ్ – ఉపాసన ల పెళ్లి రోజు . వారి వివాహ బంధం మొదలై ఎనిమిదేళ్లు పూర్తి అయ్యింది. ఐతే ఈ పెళ్లి రోజు వేడుకగా జరుపుకోవాలని ఉపాసనకు అనిపించలేదట. దానికి కారణం ఈ మధ్య వ్యక్తిగతంగా. సామాజికంగా అనేక దురదృష్ట సంఘటనలు చోటు చేసుకోవడమే అని తన సోషల్ మీడియా పేజీ లో తెలియపరిచింది.
”గత 20 రోజులు గా అనేక సంఘటనలతో తాము బాధ పడ్డామని చెప్పారు ఆమె. తమ ఫ్యామిలీ లో ముగ్గురు పెద్ద వాళ్ళను కోల్పోయామని చెప్పారు. అదే విధంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తో పాటుగా దేశ రక్షణ గా ఉన్న జవాన్ లు మరణించడం, కరోనా కేసులు పెరగడం వంటి విషయాలు బాధించాయి. ఈ నేపథ్యంలో చాలా సింపుల్ గా తమ మ్యారేజ్ యానివర్సరీ ముగించినట్లు ఆమె తెలిపింది.
