
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేకుపడింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతి రావడం తో షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఇప్పటికే పొంగల్ రేసులో ఉన్న రాజమౌళి ‘ఆర్‌ఆర్ఆర్’తో పాటు..మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, మహేశ్ ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. అందుకే ‘వకీల్‌సాబ్’ను పండగ బరిలో నిలపాలని చిత్ర దర్శక నిర్మాతలు చూస్తున్నారట.
