Site icon TeluguMirchi.com

వకీల్ సాబ్ రిలీజ్ ఫై టెన్షన్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేకుపడింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతి రావడం తో షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఓ ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తారట. అయితే చిత్ర రిలీజ్ విషయంలో దర్శక , నిర్మాతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.

‘వకీల్ సాబ్’ ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన దర్శకనిర్మాతలు దానికి తగ్గట్టుగానే షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కరోనా రావడం తో అంత రివర్స్ అయ్యింది. ఈ క్రమంలో దిల్ రాజు తన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ పై కీలక నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.కరోనా కారణంగా టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేట్ అవుతూ వస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ బాలయ్య – బోయపాటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ‘వకీల్ సాబ్’ ని కుదిరితే సంక్రాంతి రేస్ లో నిలపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.

Exit mobile version