
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేకుపడింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతి రావడం తో షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఓ ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తారట. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేసినట్లు సమాచారం.
