Site icon TeluguMirchi.com

అక్షయ్ తో వాణి రొమాన్స్

వరుస భారీ హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్.. గత ఏడాది చివర్లో ది మూవీ మెషిన్ ప్రకటించారు. అలాగే రంజిత్ తివారి దర్శకత్వంలో బెల్ బాటమ్ అనే మూవీ సైతం చేస్తున్నాడు. వింటేజ్ గెటప్ లో అక్షయ్ రాయల్ లుక్ సినిమాపై ఆసక్తి రేపింది. ఇక ఈ మూవీ లో అక్షయ్ కి జోడిగా వాణీ కపూర్ నటిస్తుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అక్షయ్ సర్ మూవీలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న ఆమె ఈ ప్రాజెక్ట్ పై బాగా ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. గత ఏడాది బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన వార్ మూవీలో వాణి కపూర్ హృతిక్ కి జంటగా నటించారు. ఇక బెల్ బాటమ్ మూవీ 2021 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

Exit mobile version