Site icon TeluguMirchi.com

మూడో పెళ్లికి సిద్దమైన ‘దేవి’ ఫేమ్

కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించిన వనితా మూడో పెళ్లి కి సిద్ధమైంది. తెలుగు లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత అతనితో మనస్పర్థల రావడం తో అతడికి విడాకులు ఇచ్చి , 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది.

ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే బిజినెస్ మేన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈ నెల 27న వివాహాం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ పెళ్లి విషయమై వనిత ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version