Site icon TeluguMirchi.com

పెళ్లిలోనే లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్

కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించిన వనితా మూడో పెళ్లి చేసుకుంది. తెలుగు లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత అతనితో మనస్పర్థల రావడం తో అతడికి విడాకులు ఇచ్చి , 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది.

ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే బిజినెస్ మేన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని శనివారం పెళ్లి చేసుకుంది. పీటర్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పెళ్లి వేడుకలో పీటర్ కు ఘాటైన లిప్ లాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Exit mobile version