Site icon TeluguMirchi.com

5 లక్షలతో వర్మ ఎంత సంపాదించాడో తెలుసా ..?

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ మూతపడడం తో నిర్మాతలంతా ఓటిటిఫై ఆధారపడుతున్నారు. థియేటర్స్ లలో రిలీజ్ చేయాల్సిన మూవీస్ ను ఓటిటి లో రిలీజ్ చేస్తూ నష్టాలనుండి బయటపడుతుండగా..మరికొంతమంది వెబ్ సిరీస్ లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ముందుగా గట్టిగా సంపాదిస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఆ వేదికపైనే ‘క్లైమాక్స్’ మూవీ రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం తనకు తానే సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోషన్స్ చేసుకున్న ఆయన, ఒక్కో వ్యూకి 100 రూపాయల పైకం డిసైడ్ చేసి భారీ సొమ్ము ను రాబట్టుకున్నాడు.

ఈ సొమ్ము చూసి వెంటనే నగ్నం అనే సినిమా చేసాడు. ఈ సారి లోకల్ అమ్మాయి స్వీటీని నగ్నంగా చూపించి మ్యాజిక్ చేశారు. ఈ మూవీకి 200 రేటు పెట్టినా కూడా జనం ఎగబడి ఎగబడి చూశారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉందని, వేలల్లో వ్యూస్ వస్తున్నాయంటూ వర్మనే స్వయంగా తెలిపాడు. ఇది చూసిన ఆడియన్స్ ఈ సినిమాల కోసం వర్మ ఎంత ఖర్చు పెట్టారు. ఎంత పోగు చేసుకుంటున్నారు? అనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నగ్నం సినిమాకు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5 లక్షలే అని తెలిసింది. ప్రెజెంట్ సినిమా డిమాండ్ చూస్తే మినిమం కోటి రూపాయ‌లైనా వ‌సూల‌య్యేలా కనిపిస్తోంది. మొత్తం మీద వర్మ ను చూసి చాలామంది ఇదే బాటలో ఆలోచిస్తున్నారట.

Exit mobile version