Site icon TeluguMirchi.com

‘వెన్నెల’ ఫస్ట్ లుక్ చూసారా..?

యాంగ్రీ యంగ్ మాన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రాజశేఖర్..ఈ మధ్యనే తన ఇద్దరి కుమార్తెలను హీరోయిన్లుగా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. పెద్ద కుమార్తె శివాని చేస్తున్న వెన్నెల చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. కే. మల్లిఖార్జున్ రామ్ దర్శకత్వంలో మహాతేజా క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిగినల్స్ కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. నేడు శివాని రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో శివాని ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఈ సినిమాలో శివాని ‘వెన్నెల’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో శివాని చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. తేజా గతేడాది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version