Site icon TeluguMirchi.com

విజయ్ – దిల్ రాజు – వంశీ పైడిపల్లి కలయికల మూవీ ప్రారంభం

తమిళ్ హీరో విజయ్ ఫస్ట్ టైం తెలుగు లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 66 వ చిత్రంగా ఇది తెరకెక్కబోతుంది. దీనికి సంబదించిన పూజా కార్య క్రమాలు ఈరోజు చెన్నై లో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ముందుగా పాటతో షూటింగ్ మొదలుపెట్టారు. ఇక విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సన్ పిక్చర్ పతాకంపై కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Exit mobile version