
బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ..ఆ తర్వాత కోహ్లీ తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓ పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ అందరిని అలరిస్తుంది. తాజాగా ఈమె..తన సోదరుడు కర్నేష్ తో కలిసి బుల్ బుల్ అనే వెబ్ సీరీస్ ను నిర్మించింది. అన్వితాదత్ దర్శకత్వం వహించిన వెబ్ ఫిల్మ్ ఇది. రాహుల్ బోస్, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, పరంబ్రాత ఛటోపాధ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు.నెట్‌ఫ్లిక్స్‌లో బుధవారం విడుదలైన సినిమా మంచి టాక్ అందుకుంది.
ఈ చిత్రాన్ని చూసిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘హృదయాల్ని కదిలించే ఈ కథ, దాన్ని తెరపై చూపించిన విధానం నాకెంతో నచ్చింది. అన్నాచెల్లెళ్లుఫైర్ మీదున్నారు సినిమా విడుదలైంది, మిస్ కావొద్దు’ అని విరాట్ పేర్కొన్నారు.
