Site icon TeluguMirchi.com

విరాటపర్వం రీ రికార్డింగ్ స్టార్ట్

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ డైరెక్షన్లో రానా – సై పల్లవి జంటగా విరాటపర్వం సినిమా తెరకెక్కుతుంది. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం రీ రికార్డింగ్ కొనసాగుతోందని సమాచారం. అయితే తమ సెటప్‌ ను మ్యూజిక్ స్టూడియోకి మార్చలేనందున, మేకర్స్ రామానాయుడు స్టూడియోలోనే తాత్కాలిక మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం మ్యూజిక్ పనులన్నీ పూర్తి స్థాయిలో అక్కడే జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా ఈ సినిమాలో మాత్రం కొత్త కోణాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయట. ముఖ్యంగా రానా పాత్రలో పాజిటివ్ థింకింగ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రానా, దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య సినిమాని ప్రారంభించనున్నారట.

Exit mobile version