
మద్యం ప్రియులకు శుభవార్త..ఇకపై మీకు ఏ వైన్ కావాలో ఆలా ఆర్డర్ చేస్తే ఆ వెంటనే మీ ఇంటికి వచ్చేస్తుంది..అది కూడా అమెజాన్ నుండి. కాకపోతే ఇది మనదగ్గర కాదు పశ్చిమ బెంగాల్‌లో. కరోనా సంక్షోభం, అన్‌లాక్-1 నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లిక్కర్ షాపులు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఆల్కహాల్‌ను ఇంటి వద్దకే సరఫరా చేసే వెసలుబాటు కల్పించింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా బెంగాల్ రాష్ట్రంలో మద్యం డెలివరీకి అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.డాట్‌కామ్‌కు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతినిచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆన్‌లైన్ డెలివరీ చేయడానికి అమెజాన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
