
సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రి G. Kishan Reddy సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో బస్తీ పర్యటన చేపట్టారు. అధికారులు వెంటబెట్టుకుని గల్లీల్లో తిరుగుతూ బస్తీ వాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పేదల సంక్షేమం, తాగునీరు, కాలువలు, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రజలు వెల్లడించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, హైదరాబాద్‌లో బస్తీల జనాభా వేగంగా పెరుగుతోందని, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీని 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లుగా విభజించి మూడు కార్పొరేషన్లుగా చేయాలనే ప్రయత్నం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ లాభాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.
హైదరాబాద్‌కు తగినంత తాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఎండాకాలం ప్రారంభంతోనే నీటి సమస్యలు కనిపిస్తున్నాయని అన్నారు. వర్షాకాలానికి ముందే కాలువల్లో సిల్ట్ తొలగింపు పనులు చేయాల్సి ఉండగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నగర సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి Revanth Reddy పై ఉందని స్పష్టం చేస్తూ, పెండింగ్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
📍వారాసిగూడ, సికింద్రాబాద్
ఇవాళ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం- బౌద్ధ నగర్ డివిజన్లోని వారాసిగూడ బస్తీలో పర్యటించాను. ఈ సందర్భంగా బస్తీవాసులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. pic.twitter.com/KtY552iasU
— G Kishan Reddy (@kishanreddybjp) February 27, 2026
