Site icon TeluguMirchi.com

TG Police: హీరో ఇన్ యూనిఫామ్ అండ్ స్పోర్ట్..

Siraj

TG Police: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ సంతతికి చెందిన మహ్మద్ సిరాజ్ మరోసారి అద్భుత ప్రదర్శనతో దేశం గర్వించుకునేలా చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో తన ఘాటైన బౌలింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంపై స్పందించిన తెలంగాణ పోలీస్ శాఖ సిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది.

తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్న సిరాజ్ కేవలం అంతర్జాతీయ క్రికెటర్‌ మాత్రమే కాకుండా, యూనిఫాంలోనూ హీరో అని పోలీస్ శాఖ ప్రకటించింది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా “డీఎస్పీ మహ్మద్ సిరాజ్‌కు అభినందనలు. ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్టు గెలుపులో మీ అద్భుత ప్రదర్శనకు అభినందనలు” అని పేర్కొంది.

అంతేకాక, సిరాజ్‌ను “ప్రైడ్ ఆఫ్ తెలంగాణ”గా అభివర్ణిస్తూ, “క్రీడల్లోనే కాదు, యూనిఫాంలోనూ హీరో” అంటూ ప్రత్యేక కితాబు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తమ శాఖ అధికారి విజయంపై తెలంగాణ పోలీస్ శాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version