Site icon TeluguMirchi.com

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్…

Kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు K. Kavitha కు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన Rouse Avenue Court ఆమెపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటినీ కొట్టివేస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి Jitender Singh ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులు తప్పు చేశారని నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

తీర్పు అనంతరం ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన కవిత, ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిందని మరోసారి పేర్కొన్నారు. ఐదున్నర నెలల పాటు తాను, తన కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించామని తెలిపారు. అయితే న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదని, “కడిగిన ముత్యం లాగా బయటికి వస్తాను” అన్న తన మాట ఈరోజు నిజమైందని భావోద్వేగంగా చెప్పారు.

జైల్లో ఉన్న సమయంలో అభిమానులు ఢిల్లీకి విమాన టికెట్లు వేసుకుని వచ్చి పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని, తెలంగాణ ప్రజలకు మొదటి నుంచే ఈ కేసులో తనకు పాత్ర లేదని చెప్పానని కవిత స్పష్టం చేశారు.

Exit mobile version