Site icon TeluguMirchi.com

CM Revanth Reddy: సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Cm revanth

CM Revanth Reddy : హైదరాబాద్‌లో గత 17 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ సమ్మె కారణంగా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాల షూటింగ్‌లు కూడా నిలిచిపోవడంతో, సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జోక్యంతో ఈరోజు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌ను దేశవ్యాప్తంగా ప్రముఖ సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఈ సమ్మె పెద్ద ఆటంకంగా మారిందని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర సినిమా పాలసీ అమలుపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఒక విడత చర్చలు జరిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా ఈరోజు ఫెడరేషన్ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. అంతేకాకుండా డీజీపీ కూడా ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్నట్లు సమాచారం.

Exit mobile version