బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతం గా 61 వ రోజుకు వచ్చేసింది..ఈ వారం ఇంటి కెప్టెన్సీ టాస్క్ కోసం తనీష్ , దీప్తిలకు బిగ్ బాస్ ‘రంగు రబ్బా.. రబ్బా’ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో తనీష్ గెలుపొంది మరోసారి హౌస్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్ లో పలు పోటీలు జరిగాయి. ఈ నేపథ్యం లో వర్షం పడుతుండడం తో అమిత్ బిగ్ బాస్ ను మంచి సాంగ్ ప్లే చేయి బిగ్ బాస్ డాన్సులు వేస్తామని కోరాడు.
వెంటనే బిగ్ బాస్ సాంగ్స్ ను ప్లే చేయడం మొదలు పెట్టాడు. ఆ పాటలకు హౌస్ సభ్యులు వర్షంలో తడుస్తూ డాన్సుల్లో మునిగితేలారు. దారి చూడు దుమ్ము చూడు మామ.., వాన వాన వెల్లువాయే .., నేను పక్కా లోకల్, ‘గీతా గోవిందం’ మూవీలోని ఇంకేం ఇంకేం పాటలకు హౌజ్‌మేట్స్ డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు. కొందరు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి మరి డాన్సులు వేశారు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బాబు గోగినేని బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుస్తుంది.