అప్పుల బాధతో కుటుంబాన్ని మొత్తాన్ని చంపబోయిన తండ్రి

కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతో హ్యాపీగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా అప్పుల్లో మునిగిపోయారు. తాజాగా వరంగల్‌లోని పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలో అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుటుంబం మొత్తాన్ని చంపేసి..తన కూడా ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆలా భార్య , కుమారుడి గొంతు కోసి..తాను కోసుకోబోయాడు.

ఇంతలో తన ఏడేళ్ల కుమార్తె భయపడి ఇంటి నుండి బయటకు పరుగులు తీసి పొరుగింటి వారికీ చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జయవర్ధన్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై చేసిన అప్పులు తీర్చలేక భార్య, కుమారుడి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.