మేన‌ల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మేనత్త, ఆపై బ్లాక్ మెయిల్ …

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 10లోని గాయ‌త్రి హిల్స్ లో నివ‌సించే ఓ ఇంట్లో బంగారు న‌గ‌లు మాయ‌మ‌య్యాయి. న‌గ‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇల్లంతా వెతుకుతున్న త‌ల్లికి తాను ఒక దండ తీసి మేన‌త్త‌కి ఇచ్చాన‌ని 14 ఏళ్ళ కొడుకు చెప్పాడు. ఎందుకిచ్చావ‌ని త‌ల్లి ప్ర‌శ్నిస్తే, అస‌లు విష‌యం బైట‌ప‌డింది. 14 ఏళ్ళ మేన‌ల్లుడిని వ‌ల‌లో వేసుకున్న ఆ మ‌హిళ.. త‌న భ‌ర్త ఇర్ఫాన్ తో క‌లిసి బెంగుళూరు నుంచి వ‌చ్చి హోట‌ల్ లో దిగేది.

మేన‌ల్లుడు చ‌దువుతున్న స్కూల్ కి వెళ్ళి త‌న‌తో పాటు తీసుకుపోయి లాడ్జిలో త‌న కామ‌వాంఛ‌లు తీర్చుకునేది. దీన్నంతా తన భ‌ర్త ఇర్ఫాన్ వీడియో తీసేవాడు. ఆ త‌ర్వాత ఆ పిల్ల‌వాడికి వీడియోలు చూపించి ఇంట్లో నుంచి బంగారు న‌గ‌లు, డ‌బ్బులు తీసుకురాక‌పోతే వీడియోలు బ‌య‌ట‌పెడ‌తానంటూ ఆ పిల్లాడిని భ‌య‌పెట్టేది. దీంతో బంగారు న‌గ‌ల‌తో పాటు ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు చోరీ చేసి మేన‌త్త‌కి ఇచ్చాడు. మూడు సార్లు త‌న‌ను స్కూల్ నుంచి లాడ్జికి తీసుకెళ్లింది కొడుకు త‌ల్లికి చెప్పేశాడు. ఆ బాబు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో జూబ్లిహిల్స్ పోలీసులు ఆమెను, ఆమె భ‌ర్త‌ను అరెస్టు చేసి ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి జైలులో పెట్టారు.