Site icon TeluguMirchi.com

కేసీఆర్‌కు బాబు కౌంట‌ర్‌

తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ ని దెబ్బ తీయాలని బాబు.. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో తమకు శత్రువైన కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాడు. తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు..కానీ ఓటర్లు కలవలేదు. దీంతో రెండో పార్టీ లు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాయి. ఆ తర్వాత కేసీఆర్..చంద్రబాబు ఫై ఘాటైన వాక్యాలు చేయడం..మొన్నటి ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ఫై బాబు వాక్యాలు చేయడం జరిగిపోయాయి. ఇక కేసీఆర్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తున్న చంద్రబాబు కు తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలు అస్త్రంగా మారాయి.

బోర్డు తప్పిదాల కారణంగా పరీక్షలు బాగా రాసినప్పటికీ తాము ఫెయిలయ్యామని విద్యార్థులు వాపోతున్నారు. తెలంగాణ సర్కారును బోర్డు అవకతవకలు, విద్యార్థుల బలవన్మరణాల అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. తెలంగాణలో 16 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెలువడుతున్న వార్తలు బాధించాయన్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version