Site icon TeluguMirchi.com

కేశినేని కాక పుట్టిస్తున్నారు..

కేశినేని నాని..ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ గా మారింది. ఎంపీగా గెలుపొందిన నాని..ప్రస్తుతం సోషల్ మీడియా లో కాక పుట్టిస్తున్నారు. రోజుకో ఓ పోస్ట్ పెడుతూ తన ఆవేదన..ఆగ్రహం..బాధ ఇవన్నీ బయటపెడుతున్నారు. సుదీర్ఘ కాలంగా తన మనసులో ఉన్న వాటిని బయటపెడుతుంటే..కొంతమంది టీడీపీ నేతలు కేశినేని పార్టీ ని వీడేందుకు ఇలా చేస్తున్నారని..బీజేపీ మెప్పు పొందిందేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి కేశినేని మనసులో ఉన్న ఆవేదన చంద్రబాబు కు అర్ధం కావాలని చేస్తున్నాడు.

కొన్ని జిల్లాలను కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల నాలాంటి వారి బాధ ఆయనకు తెలియాలని కేశినేని వాపోతున్నారు. పార్టీ ని నమ్ముకున్న వారికీ అన్యాయం జరుగుతుందని ..అందుకే ఇలా చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version