Site icon TeluguMirchi.com

తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీసిన జనసేన..

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ..జనసేన పార్టీ ఫై విరుచకపడింది..ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో..ప్రచారం మొదలు పెట్టారో జనసేన ఫై సాఫ్ట్ కార్నర్ చూపిస్తే పవన్ కూడా తెలుగుదేశం సభ్యుడే అనే భావనను ప్రజల్లో కలుగచేసింది. అలాగే పవన్ కూడా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేయకుండా వైసీపీ పార్టీ ని ..జగన్ ను టార్గెట్ చేయడం..బాబు చెప్పినట్లు పవన్ పలు ప్రసంగాలు చేయడం తో జనాలు కూడా పవన్ బాబు మనిషే అని నమ్మరు. దీంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ని దెబ్బ తీశామని..ఆ ఓట్లు కూడా మనకే పడుతున్నాయని తెగ సంబరపడింది. కానీ గ్రాండ్ లెవల్ చూస్తే జనసేన పార్టీ ని టీడీపీ దెబ్బ తీయడం కాదు..టీడీపీ పార్టీ నే జనసేన దెబ్బ తీసిందని తెలుస్తుంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కి మంచి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపూర్ , కర్నూల్ మొదలగు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ కి గట్టి పోటీ ఇచ్చిందని..కొన్ని స్థానాల్లోయితే విజయం దిశగా ఉందని అంటున్నారు. టీడీపీ ఓట్లను చాల వరకు జనసేన చీల్చి సెకండ్ ప్లేస్ లో నిల్చుందని అంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version