Baahubali Re-release : బాహుబలి రీ-రిలీజ్, శోభు యార్లగడ్డ అఫిసియల్ అనౌన్స్మెంట్..


బాహుబలి సినిమా, తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసింది. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం, భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం పొందింది. బాహుబలికి తన స్వంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ చిత్రం విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా, బాహుబలి టీమ్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. బాహుబలి రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. అక్టోబరులో థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. ఈసారి కొన్ని కొత్త సీన్లు కూడా యాడ్ చేస్తున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు కానీ అవి ఏమిటి అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత ఇవ్వలేదు. ఎడిట్ చేసిన సీన్లతో పాటు, ఇప్పటివరకు చూసిన మనకు తెలియని కొన్ని అన్-సీన్ ఫుటేజీని కూడా విడుదల చేయబోతున్నారు.

Also Read :  Eleven Trailer : నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవెన్' ట్రైలర్ లాంచ్

ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బాహుబలి రెండు భాగాలను ఒకేసారి రీ-రిలీజ్ చేస్తారా లేదా మొదటి భాగమే రీ-రిలీజ్ చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. బాహుబలి: ది బిగినింగ్ పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రాబోతుండగా, బాహుబలి: ది కన్‌క్లూషన్ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, అభిమానులు మొదటి పార్టే రీ-రిలీజ్ చేస్తారా అని ఆలోచన చేస్తున్నారు. బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌గా మార్చింది, రానాకు మంచి పేరు తెచ్చింది, అనుష్క, తమన్నా, కీరవాణి వంటి నటుల పేర్లు మరింత మార్మోగాయి. ఈ సినిమా ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల మదిలో అమోఘమైన ముద్ర వేసింది.