NTRNeel : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి పాన్ ఇండియా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్‌లను తెరకెక్కించిన ప్రశాంత్‌తో ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఎన్టీఆర్‌నీల్’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్‌నీల్’ మూవీపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా జూన్ 25, 2026లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా అందరినీ అలరించనుంది. గ్లోబల్ స్థాయిలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, విడుదల తేదీ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
తారక్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారని, ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఆయనను ఇప్పటివరకు ఎవరు చూడనివిధంగా వెండితెరపై చూపించనున్నారని అంచనాలు ఉన్నాయి. గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నీషియన్లు, ప్రతిభావంతమైన ఆర్టిస్టులు భాగమవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.