పవన్, సాయితేజ్ మూవీ టైటిల్.. చివరకు అదే ఫైనల్ చేసారుగా..!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘PKSDT’. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘బ్రో’ అనే టైటిల్ నే మేకర్స్ అధికారికం చేశారు.

Also Read :  Baahubali Re-release : బాహుబలి రీ-రిలీజ్, శోభు యార్లగడ్డ అఫిసియల్ అనౌన్స్మెంట్..

కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అనే శ్లోకంతో మోషన్ పోస్టర్ మొదలయ్యింది. కాల రుద్రుడును ఒకపక్క, గడియారాలను ఇంకోపక్క బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తూ.. పవన్ ను లుక్ ను రివీల్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ టీజర్ లో మరో బిగ్గెస్ట్ హైలైట్ థమన్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మొత్తానికి ఒక్క టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 28 న రిలీజ్ కానుంది.

Also Read :  Mokshagna Entry : బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ? నందమూరి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!