Site icon TeluguMirchi.com

అమెరికా అంటే భయపడుతున్న హీరోయిన్స్

వరస కళంకాలతో చెడ్డ పేరు తెచ్చుకోవడంలో పరిపూర్ణం అవుతోంది టాలీవుడ్. డ్రగ్స్ అయ్యాయి, కాస్టింగ్ కౌచ్ అయ్యింది.. ఇప్పుడు వ్యభిచారం రచ్చ మొదలైంది. ఇందులో కొంతమంది హీరోయిన్లే భాగం అయ్యారనే అంటున్నారు. అమెరికాలో తెలుగు దంపతులు నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది.

ఈ నేపధ్యంలో ఇది వరకు అమెరికాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, చిత్రీకరణలకు ఉత్సాహంగా వెళ్లే తెలుగు తారలు ఇప్పుడు విదేశాల మాటెత్తితేనే హడలిపోతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పట్నుంచి అక్కడి పోలీసులు సినిమా తారలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల ఓ యంగ్ హీరోయిన్ ప్రయాణాలపై అనుమానం వ్యక్తంచేసిన అమెరికా పోలీసులు ఆమెని చాలాసేపు విచారించినట్టు, సదరు ప్రయాణాలన్నీ చిత్రీకరణల కోసమే అని తేలడంతో వదిలిపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా అంటే భయపడుతున్నారు హీరోయిన్స్.

Exit mobile version