నాగార్జునని అలా చూడగలమా ?

ప్రవీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. యాక్షన్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో నాగ్ గెట‌ప్ కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. అస‌లు ఏమాత్రం మేక‌ప్ వేసుకోకుండా న‌టించబోతున్నాడ‌ట‌. ఈ విషయాన్ని నాగ్ కూడా ధృవీక‌రించారు.
”ఈసారి ఓ భిన్నమైన ప్ర‌య‌త్నం చేస్తున్నా. ప్రవీణ్ స‌త్తారు ద‌ర్శక‌త్వంలో వ‌చ్చే సినిమాలో.. మేక‌ప్ జోలికి వెళ్ల‌డం లేదు. స‌హ‌జంగా క‌నిపించ‌బోతున్నా. హెయిర్ క‌ల‌ర్ కూడా వేసుకోను.. అంత‌లా న‌న్ను ఆ పాత్ర స్ఫూర్తినిచ్చింది” అని చెప్పుకొచ్చాడు నాగ్.

 నాగ్ అంటే వెండితెర మన్మధుడు. ఇప్పటికీ ఆయన గ్లామర్ అలానే వుంది. ఐతే దీనికి మేకప్ కొంచెం దోహద పడేది. కానీ ఈసారి చాలా రియలెస్టిక్ నాగ్ కనిపించబోతున్నారు. ఇప్పటి వరకూ నాగ్ ఇలా కనిపించిన సందర్భాలు లేవు. మరి నాగ్ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.