నితిన్ ‘చెక్’ బౌన్స్ కి కారణం ఇదే

నితిన్ లేటెస్ట్ సినిమా చెక్ రిజల్ట్ గురించి చెప్పనక్కర్లేదు. మొదటి ఆట పడినప్పడే రిజల్ట్ అర్ధమైపోయింది. భీష్మ తర్వాత నితిన్ నుండి వచ్చిన ఈ సినిమా నితిన్ ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అసలు నితిన్ ఈ సినిమా చేసినప్పుడే అందరిలో ఓ అనుమానం. కారణం దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. టాలీవుడ్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ లో చందు ఒకరు. ఐతే నుండి ఆయన ప్రయాణం విలక్షణంగా సాగింది. ఐతే ఆయన సినిమాలు కమర్షియల్ సినిమాగా నిలిచిన దాఖలాలు లేవు. ఇక ఐదేళ్ళుగా ఆయన సినిమా చేయడమే మానేశాడు.

అలాంటి చందూతో నితిన్ జోడి కట్టాడు. ఐతే చందూ నితిన్ తో ఎదో విలక్షణ మైన సినిమా తీస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన రివర్స్ గేర్ వేశాడు. తనపై వున్న విలక్షణమైన ముద్ర చెరిపేసి కమర్షియల్ దర్శకుడు అనిపించుకోవాలని నితిన్ చెక్ ని చెక్కాడు. దీంతో అసలుకే మోసం వచ్చింది అటు చన్డూ మార్క్ , ఇటు నితిన్ మార్క్ .. ఇలా ఎటూ కాకుండా పోయింది చెక్. కొత్తదనం కోసం ప్రయత్నం చేయకపోగ చూసిన సినిమాలే మళ్ళీ చూస్తున్నామన్న ఫీలింగ్ కలిగించింది చెక్. టోటల్ గా నితిన్ కెరీర్ లో మరో ‘చెక్’ చెల్లకుండాపోయింది.