బస్ డ్రైవర్ కూడా అంకితం .. దటీజ్ రజనీ

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డ్  దాదాసాహెబ్‌ ఫాల్కే సూపర్ స్టార్ రజనీకాంత్ కి వరిచింది. ఈ  అవార్డు తనని వరించడం పై   రజనీకాంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.  

‘సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్‌, నా స్నేహితుడు రాజ్‌ బహదూర్‌, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను” అని తన మనోగతం బయటపెట్టారు రజనీ.

ఐతే ఈ క్రమంలో బస్ డ్రైవర్ ని కూడా ఆయన గుర్తు పెట్టుకోవడంపై అభిమానుల్లో రజనీ మరింత గౌరవం పెంచింది. దీనిపై దటీజ్ రజనీ అని కామెంట్స్ చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ ఫాన్స్.