రష్మిక… ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ?

చిన్నపిల్లాడు ముద్దుముద్దు గా మాట్లాడితే అందంగా వుంటుంది. కానీ ఎద్దులా పెరిగిన తర్వాత కూడా ముద్దుగా మాట్లాడితే దున్నపోతులా వున్నావ్ మాట్లాడం చేతకావడం లేదా ? అని తిట్టాలనిపిస్తుంది. ఇప్పుడీ దున్నపోతు కధ ఎందుకంటే హీరోయిన్ రష్మిక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది రష్మిక. దీనికి కారణం రష్మిక సుల్తాన్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు.

ఈ వేడుకలో రష్మిక మాటలు వింటే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనిపించింది కొంతమంది నెటిజన్స్ కి. ‘కరోనా ఎలా ఉంది?  అని వెటకారంగా ఎదో చెప్పబోయింది. అక్కడితో ఆగలేదు.   ‘చుప్‌..ఆపండెహే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది.. ప్లీజ్ రా మాట్లాడనీయండ్రా’అంటూ తెగ వయ్యారాలు పోయింది. ఇందంతా చూసి ‘అబ్బో ఓవర్ యాక్షన్.. కంటింగ్ కొంచెం తగ్గించుకుంటే మంచిది” అని చెవులు కోరుకున్నారు జనాలు. ముద్దుముద్దుగా మాట్లాడితే బాగానే వుంటుంది. కానీ దానికి టైమింగ్ కుదరాలి. కానీ అదే పని మాట్లాడితే ఇలానే ఓవర్ యాక్షన్ అనే కామెంట్స్ వినాల్సి వస్తుంది.