సాయి పల్లవి స్పీడు మాములుగా లేదు

సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.
 ఇప్పుడు ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని సారంగ దరియా గీతం సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు 100 మిలియ‌న్ల మైలురాయిని అతి వేగంగా అందుకున్న పాట‌గా మిగిలిపోయింది.

నాగ‌చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన సినిమా ఇది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శకుడు. సుద్దాల అశోక్ తేజ రాసిన `సారంగ ద‌రియా` ఎంత క్రేజ్ తెచ్చుకుందో, అన్ని వివాదాల‌కూ కార‌ణ‌మైంది. చివ‌రికి… అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చి, ఆ మ‌చ్చ కూడా తొలగిపోయింది. `ఫిదా`లో వ‌చ్చిండే – పాట ఆ సినిమాని మ‌ళ్లీ మళ్లీ చూసేలా, ఆ సినిమా గురించి మ‌ళ్లీ మ‌ళ్లీ మాట్లాడుకునేలా చేసింది.

ఈ సినిమా ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సినిమాపై హైప్ పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమాకి వున్న క్రేజ్ ప్రకారం రిలీజ్ కిఉ ముందే బిజినెస్ జరిగిపోయింది. అంతేకాదు ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.