ఇదీ పవన్ కళ్యాణ్ రేంజ్

పవన్‌కల్యాణ్‌ వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే సినిమా ట్రైలర్‌ సాధించనన్ని రికార్డులను ‘వకీల్‌సాబ్’ సృష్టించింది. 24 గంటల్లో 22.44 మిలియన్‌ వ్యూస్‌ ను దక్కించుని టాలీవుడ్‌ అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్న ట్రైలర్‌గా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

అంతేకాదు  లైక్స్ విషయంలోనైనా ఇండియన్ సినిమాల్లో అన్ని ‘ఫాస్టెస్ట్’ రికార్డులనూ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ బద్దలు కొట్టేసింది. వ్యూస్‌ను మించి ఈ ట్రైలర్‌కు వచ్చిన లైక్స్ ఆశ్చర్యం కలిగించేవి. ఇప్పటిదాకా ఒక్క రోజు వ్యవధిలో ఏ సినిమా ట్రైలర్‌కూ 5 లక్షల లైక్స్ కూడా రాలేదు. అలాంటిది ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌కు 24 గంటల వ్యవధిలో 10 లక్షలకు పైగా లైక్స్ పడటం చిన్న విషయం కాదు. యూట్యూబ్‌లో ఒక లైక్ కొట్టాలంటే కచ్చితంగా ఈమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. అలాంటి లైక్స్ 10 లక్షలకు పైగా ఒక రోజు వ్యవధిలో వచ్చాయంటే పవన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.