Site icon TeluguMirchi.com

ట్రైలర్ రివ్యూ : ‘వకీల్‌సాబ్‌’

పవన్‌ కల్యాణ్‌   ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌లో అదరగొట్టిన పవన్‌ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా కనిపించారు.`ఆర్ యూ వ‌ర్జిన్‌` అనే ప్ర‌కాష్ రాజ్ డైలాగ్ తో ట్రైల‌ర్ ‌మొద‌లైంది. అమ్మాయిలు – కోర్టు గొడ‌వ‌లు…. వీటి మ‌ధ్య ఓ ఎమోష‌న్ మూమెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదో కోర్టు డ్రామా. దానికి త‌గ్గ‌ట్టుగానే కోర్టు రూమ్ లో సంభాష‌ణ‌లే ఎక్కువ‌గా వినిపించాయి

 బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు.  శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Exit mobile version