రజనీ ‘అవార్డ్’ చుట్టూ ‘రాజకీయం’

ప్రతిష్టాత్మక‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. 2020కి గాను సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు వ‌రించింది.  ఐతే ఇప్పుడీ అవార్డ్ చుట్టూ రాజకీయం పులుముకుంది. భార‌త‌దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుల జాబితాలో ర‌జనీ ప్ర‌ధ‌మ స్థానంలో వుంటారు  దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోల జాబితాలోనూ త‌న‌దే అగ్రస్థానం. న‌టుడిగా, నిర్మాత‌గా, క‌థ‌కుడిగా… ర‌జ‌నీ చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యాల్ని అందుకున్నారు. త‌మిళ చిత్రసీమ‌ని అత్యంత ప్ర‌భావితం చేసిన న‌టుడు.. ర‌జ‌నీ. 70 ఏళ్ల వ‌య‌సులోనూ… అదే జోరు, అదే స్పీడు కొనసాగిస్తున్నారు. ఆయనకి ఈ అవార్డు రావడం సముచితమే. రజనీ ఈ అవార్డ్ కు అసలు సిసలైన అర్హుడు.

కానీ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న వేళ బిజెపి మోడీ సర్కార్ ఈ అవార్డ్ ఇవ్వడంపై రాజకీయం రాజుకుంది. ఎన్నికలని ప్రభావితం చేసే విధంగా ఈ అవార్డు ప్రకటన వుందని కొందరు కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నిల నియమాళి తీసుకున్నా ఓటర్లుని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వం ఏ ప్రకటన కూడా చేయకూడదు. కానీ ఇలాంటి ఎన్నికల సమయంలో రజనీకి అవార్డ్ ప్రకటించడం రాజకీయ మలపు తీసుకుంది.