Site icon TeluguMirchi.com

రాజమౌళి మాట నిజం చేసిన త్రివిక్రమ్

”మాస్ సినిమాల్ని తీయడంలో మీరు దిట్ట. మరి మీ స్థాయిలో అలాంటి సినిమాలు తీయగల దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరున్నారు?” ఈ ప్రశ్న ఒకసారి దర్శకధీరుడు రాజమౌళికి ఎదురైయింది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం. త్రివిక్రమ్ సుకుమార్. వీరిద్దరు కానీ మాస్ సినిమాలు తీయడం మొదలుపెడితే నేను కొంచెం జాగ్రత్తపడాలి. వాళ్ళకు మామూలు క్యాలిబర్ లేదు. దుమ్మురేపేస్తారు” అని చెప్పుకొచ్చారు రాజమౌళి. సుకుమార్ సంగతి ఏమిటో కాని త్రివిక్రమ్ మాత్రం ఇప్పుడు అలాంటి సినిమా ట్రై చేశాడనిపిస్తుంది.

ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ వీర మాస్ లెవల్ లో చూపించాడు అరవింద సమేతలో. ఈ సినిమా టీజర్ పిచ్చి కేక లేపేసింది. ‘మండు వేసవి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ ఈ రేంజ్ లో వుంది ఆయన మాస్ హీరోయిజం. ‘కంటబడ్డావా… కనికరిస్తానేమో! యెంటబడ్డానా… నరికేస్తావొబా’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వింటే రోమాలు నిక్కబోడుస్తాయి. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ లో రం.. రుధిరం.. రం.. శిశిరం.. రం.. సమరం అంటూ వచ్చిన మ్యూజిక్ కెవ్వు కేక. ఇక కత్తులలో నెత్తురు పారింది. కార్లు వంతెనలు పైకి లేచాయి. అబ్బో .. త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్ తో ఒక పక్కా మాస్ మసాల సినిమా తీసేశాడని చెప్పాలి.

Exit mobile version