రామ్ చరణ్- శంకర్.. కొత్త ఫిట్టింగ్

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైయింది. ఇలాంటి నేపధ్యంలో ఓ బ్రేక్ పడింది. దిని వెనుక కధలోకి వెళితే..   `ఇండియ‌న్ 2` సినిమా కమ‌ల్ హాస‌న్ తో శంక‌ర్ ఇండియన్ 2 ని మొద‌లెట్టిన సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకి అన్నీ అవాంత‌రాలే. శంక‌ర్ కూ నిర్మాణ సంస్థకూ… కుదరలేదు. ఇండియ‌న్ 2 మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ సినిమాని అలానే ప‌క్కన పెట్టేసి, రామ్ చ‌ర‌ణ్ సినిమా మొద‌లెట్టాల‌ని శంక‌ర్ ఫిక్స‌య్యాడు. అయితే లైకా నిర్మాత‌లు ఈ విష‌య‌మై కోర్టుని ఆశ్రయించారు.

`ఇండియ‌న్ 2` పూర్తవ్వకుండా… శంక‌ర్ మ‌రో సినిమా చేయ‌డానికి వీల్లేదంటూ పిటీష‌న్ వేశారు.  ఈ సినిమాపై ఇప్ప‌టికే 180 కోట్లు ఖ‌ర్చు చేశారు నిర్మాత‌లు. ఇంకో 50 కోట్లు పెడితే సినిమా పూర్తవుతుందని అగ్రిమెంట్ లో వుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం జరగాలని పట్టుబడుతున్నారు నిర్మాతలు. మరి ఈ విషయంలో శంకర్ ఎలా ముందుకు  వెళ్తారో చూడాలి.