రెండు ఓటిటిల్లో ఒకేసారి రిలీజ్ అయిన ’18 పేజెస్’


నిఖిల్, అనుపమ కాంబోలో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్ళని సాధించింది. తాజాగా 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ జంట. కార్తికేయ 2 కంటే ముందే 18 పేజెస్ సినిమాను ప్రారంభించారు. కానీ కొన్ని కారణవల్ల ఈ సినిమాకి బ్రేక్ పడింది. మొత్తానికి ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలై పర్వాలేదనిపించుంది. డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఈరోజు ఓటీటీలో కి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహాతో పాటు ఇంటర్నేషనల్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకేరోజు ఈ చిత్రం ఈరెండు స్ట్రీమింగ్ యాప్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది.