2022 సంక్రాంతి బరి గట్టిగానే ఉండబోతుంది

సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకే కాదు సినీ ప్రేమికులకు పెద్ద పండగే. తమ అభిమాన హీరోల చిత్రాలన్నీ కూడా సంక్రాంతి బరిలో వచ్చి సత్తా చాటుతుంటాయి. 2022 సంక్రాంతి బరి గట్టిగానే ఉండబోతుందని అర్ధమవుతుంది. పవన్ – రానా ల మల్టీస్టారర్ , మహేష్ – పరుశురాం సర్కారు వారి పాట తో పాటు ప్రభాస్ – రాధాకృష్ణల రాధేశ్యామ్ బరిలోకి రాబోతున్నాయి. వీటితో పాటు వెంకీ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 కూడా బరిలో నిలువబోతుందని వినికిడి. మొత్తం మీద 2022 గట్టి పోటీనే. మరి ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.