AA22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 22వ చిత్రంగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. #AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రకటనతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి, హాలీవుడ్ సినిమాల కోసం పని చేసిన వీఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేస్తుండటంతో టెక్నికల్‌గా ఇది అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమా కానుంది. కళానిధి మారన్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
అయితే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ముంబైలో అత్యంత సింపుల్‌గా, సైలెంట్‌గా జరిగినట్లు సమాచారం. ఈ వేడుకకు యూనిట్‌లోని కొద్దిమంది ముఖ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లోనూ జరగనుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్‌కి గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చే ఈ ప్రాజెక్ట్ ఎంతటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.