ఆగిపోయిన ఆచార్య షూటింగ్, రిలీజ్ డేట్ పోస్టుపోన్ ?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఫైనల్ షూట్ లో భాగంగా రాంచరణ్, సోనూ సూద్ మధ్య యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు, అనుకోకుండా సోను సూద్ కరోనా బారిన పడటంతో ప్రస్తుతానికి ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ పోస్టుపోన్ అయ్యే అవకాశం ఉంది.