Site icon TeluguMirchi.com

మహాసముద్రం – అదితి రావు ఫస్ట్ లుక్

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి, ప్రస్తుతం ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై శర్వానంద్ , సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ప్రముఖ పాత్రలలో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ ని పరిశీలిస్తే దుఃఖాన్ని దిగమింగుకుంటూ .. కన్నీళ్లను వర్షిస్తూ .. తడారిపోయిన పెదలతో ఆమె ఈ ఫస్టులుక్ పోస్టర్ లో కనిపిస్తోంది. తనకి ఎవరో దూరమవుతున్నట్టు .. తాను ఎవరినో విడిచి వెళుతున్నట్టు బాధతో కూడిన భావన ఆమె కళ్లలో కనిపిస్తోంది. ఈ ఫస్టులుక్ ను బట్టి ఈ సినిమాలో ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువని అర్థమవుతోంది.

Exit mobile version