Site icon TeluguMirchi.com

మహేష్ తో.. ఐష్ !!

mahesh-and-aishమణిరత్నం-మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోస్ మహేష్ బాబు, నాగార్జునతో పాటుగా మలయాళం స్టార్ ఫహద్ కూడా ఈ మూవీలో నటించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా, ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదే.. ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ.. అవునండీ మహేష్ మూవీలో ఐష్ నటిస్తుందట. ఇందుకు ఐష్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మణిరత్నం ఇద్దరు చిత్రం ద్వారా తెరకు పరిచయమైంది ఐష్. ఇప్పుడు మళ్లీ మణిరత్నం మూవీతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. మహేష్-ఐష్ జంటపై టాలీవుడ్ లో అప్పుడే చర్చ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఈ మధ్య కాలంలో భారీ మల్టిస్టారర్ మూవీ ఇదే అవడం ఖాయం.

Exit mobile version