Garuda 2.0 : ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ ‘గరుడ 2.0’


Garuda 2.0 : విజయవంతమైన చిత్రాలను వరుసగా అందించిన హనుమాన్ మీడియా పతాకంపై సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి వంటి హిట్ సినిమాల్ని అందించిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు మరో ఆసక్తికర థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆరత్తు సీనం (Aarathu Sinam) చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరుతో విడుదల చేశారు. డిమోంటి కాలనీ ఫేమ్ అరుళ్ నీతి, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు.

Also Read :  CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో

ప్రస్తుతం గరుడ 2.0 ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని నిర్మాత బాలు చరణ్ వ్యక్తం చేశారు. అద్భుతమైన కథనంతో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ సినిమా తప్పక చూడదగినదిగా ఆహా టీం చెబుతోంది. ఓటీటీలో థ్రిల్లింగ్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఓ ఎంగేజింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

Also Read :  Single : 'సింగిల్' మూవీ ఇంటిళ్లపాదిని కడుపుబ్బా నవ్విస్తుంది : శ్రీ విష్ణు