103 సెంటర్లలో అఖండ 50 రోజుల పండగ

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ..బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నేటికీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 103 సెంటర్ లలో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకోవడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడలేదు. దీంతో నందమూరి అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది