నోటిలో గొడ్డలి… చేతిలో కపాలంతో అఖండ కొత్త పోస్టర్ కేక

బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమా గా రాబోతుండడం తో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్రయూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి అంచనాలు మరింత పెంచారు. ఈ పోస్టర్ లో బాలయ్య నోటిలో గొడ్డలి… చేతిలో కపాలంతో బ్యాక్ గ్రౌండ్‌లో శివాలయం లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ఇక ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.