అఖండ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కొట్లో తెలుసా..?

‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘అఖండ’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో సినిమా ఎలా ఉందనేది తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఫై భారీ అంచనాల ఉన్న క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా భారీగా జరిగినట్లు తెలుస్తుంది.

ఏపీ + తెలంగాణ: 46.40 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.47 కోట్లు
ఓవర్సీస్: 2.40 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 53.30 కోట్లు షేర్ జరిగింది. అఖండ సినిమా సేఫ్ జోన్ కు రావాలి అంటే 55 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. అంటే బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప అఖండ బ్రేక్ ఈవెన్ కాదు. మరి బోయపాటి ఏంచేసాడో చూడాలి.