అఖండ ప్రీమియర్ షో టాక్..బొమ్మ బ్లాక్ బస్టర్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈరోజు (డిసెంబర్‌ 2న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి సినిమాకు మరింత హైప్ తెచ్చారు. ఇక ఈ చిత్ర ప్రీమియర్ షోస్ హైదరాబాద్ లో తెల్లవారు జామున పడ్డాయి. ఇక ఈ బినిఫిట్ షో చూసిన అభిమానులు , సినీ ప్రేక్షకులు సినిమా ఎలా ఉందొ..బాలయ్య నట విశ్వరూపం ఎలా ఉందొ..బోయపాటి యాక్షన్ ఏ రేంజ్లో ఉందొ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందొ వారి మాటల్లో చూద్దాం.

ఫస్టాఫ్ మోతమోగించిందని, మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి మరోసారి తన మార్క్ స్పష్టంగా చూపించారని అంటున్నారు. సెకండాఫ్ కూడా అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు.

బాలయ్య నుండి వచ్చే ప్రతి మాస్ డైలాగ్ థియేటర్స్ లలో ఈలలు వేయించిందని..బాలయ్య కు మాత్రమే ఆ డైలాగ్స్ చెల్లుతాయని అంటున్నారు. ఇక డాన్స్ లలో కూడా బాలయ్య బాగా చేసాడని చెపుతున్నారు. ఇక ఫైట్స్ గురించి చెప్పాలిసిన అవసరం లేదని..కుమ్మేసాడని అంటున్నారు.

ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని, ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని ట్వీట్స్ పెడుతున్నారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని అంటున్నారు. బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్ అంటున్నారు. ఓవరాల్ గా అఖండ బ్లాక్ బస్టర్ అని తేల్చి చెపుతున్నారు.