అఖండ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 3500 ..బాలయ్య మజాకా..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏపీలో బినిఫిట్ షోస్ లేనప్పటికీ హైదరాబాద్ లో మాత్రం బినిఫిట్ షోస్ కు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 2న తెల్ల‌వారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌లో బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి. ఇక బినిఫిట్ షోస్ అంటే వాటి టికెట్ ధర ఎలా ఉంటుందో తెలియంది కాదు వెయ్యి నుండి రెండు వేల వరకు ఉంటుంది.

అయితే అఖండ బినిఫిట్ షో టికెట్ మాత్రం ఏకంగా రూ. 3500 పలుకుతున్నట్లు వినికిడి. అయినాగానీ నందమూరి అభిమానులు రూ.3500 కాదు 5 వేలైనసరే తగ్గిదిలే అంటున్నారు. ఇదిలా ఉంటె ఈ బినిఫిట్ షో చూసేందుకు ఆంధ్రా నుంచి 350 మంది అభిమానులు ఏకంగా బస్సులు మాట్లాడుకొని వస్తున్నారట. ఇవన్నీ చూసిన తర్వాత బాలకృష్ణ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.